తన ‘క్రాక్’ శాంపిల్ చూపడానికి రెడీ అయిన రవితేజ

Published on Feb 21, 2020 1:05 pm IST

ఈ ఏడాది ఆరంభంలో ‘డిస్కో రాజ’తో పలకరించిన రవితేజ చేస్తున్న కొత్త చిత్రం ‘క్రాక్’.
గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 8వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇక ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్బంగా టీజర్ సిద్దం చేశారు టీమ్. ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు ఈ టీజర్ విడుదకానుంది.

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటించనుండగా వరలక్ష్మీ శరత్ కుమార్, సముథిరఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతంలో రవితేజ, గోపిచంద్ మలినేనిల కాంబినేషన్లో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి ఉండటంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో రవితేజ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర ‘కిక్’ చిత్రంలో రవితేజ చేసిన ఫుల్ ఎనర్జిటిక్ పాత్ర తరహాలోనే ఉండనుంది. ఇకపోతే మాస్ మహరాజ తన తర్వాతి చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్షన్లో చేసే ఆలోచనలో ఉన్నారట.

సంబంధిత సమాచారం :

X
More