రావురమేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా…?

Published on May 17, 2019 2:29 pm IST

తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో రావు రమేష్ ఒకరు. గ్రేట్ రావుగోపాల్ రావ్ తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రమేష్ తండ్రికి తగ్గ నటుడిగా నిరూపించుకున్నారు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల తెలుగు నటులెవరైనా ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్నారంటే అది రావు రమేష్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐదుపదుల వయసులో ఉన్న ఆయన కాలేజ్ ఏజ్ కుర్రాడిలా గాల్లో ఎగురుతున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎప్పుడూ తండ్రి వేషాలు లేదా విలన్ వేషాలు వేస్తూ సీరియస్ గా కనిపించే రావ్ రమేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించక మానదు ఆ ఫోటో చూస్తే.

ప్రముఖ హాస్యనటుడు అయిన వెన్నెల కిషోర్ ఈ ఫోటో తీశారంట. ఫోటో ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి” జాలీ సైడ్ అఫ్ అవర్ వెర్సిటైల్ యాక్టర్ క్యాప్చర్డ్ బై మీ” అని ఓ కామెంట్ కూడా పెట్టారు. మరో వైపు క్రేజీ మూవీ “కెజిఫ్2″లో రావ్ రమేష్ ఓ కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం :

More