చరణ్ సినిమా ఫస్ట్ లుక్ ఆరోజే ?

Published on Oct 23, 2018 10:19 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇంకా 30రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. అనుకున్న సమయానికి చిత్రీకరణను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం యొక్క అప్ డేట్స్ కోసం చరణ్ అభిమానులు చాలా రోజులనుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను దీపావళి కి విడుదల చేయనున్నారట.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరోలు ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :