కధ నచ్చితే పారితోషికం గురించి అంతగా పట్టించుకోను: సమంత

కధ నచ్చితే పారితోషికం గురించి అంతగా పట్టించుకోను: సమంత

Published on Feb 10, 2015 12:53 AM IST

samantha
అందాల భామ సమంత తాజాగా ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చింది. తనకి గనుక కధ మనస్పూర్తిగా నచ్చితే పారితోషికం విషయంపై అంతగా శ్రద్ధ చూపనని తెలిపింది. సేన్సిబిల్ స్క్రిప్ట్ లు, నటనకు స్కోప్ వున్న స్క్రిప్ట్ లపై మోజు పడినట్టు సమాచారం. ఒక వార్తాపత్రికకు ఇంటర్వ్యూలో తన టాలెంట్ ని బయటపెట్టే స్క్రిప్ట్ ల కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. విశేషం ఏమిటంటే ఇప్పటివరకూ అటువంటి చిత్రం సమంత కెరీర్ లో ఇప్పటివరకూ రాలేదు.

ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ప్రస్తుతం సమంత పారితోషికం భారీ స్థాయిలోనే వుంది. అయితే ఫ్లాపులు వస్తున్న ప్రతీసారి ఆమె తన తదుపరి సినిమాకు రెమ్యునరేషన్ తగ్గించుకుంటూ వచ్చింది.

కేవలం హీరోలకోసమే కాదని తమ అభిమాన హీరోయిన్ల కోసం సైతం ప్రేక్షకులు సినిమాలకు వస్తారని చిత్రసీమలో హీరోయిన్ పాత్ర మరువలేనిదని తెలిపింది.

తాజా వార్తలు