వైరల్ : బెంగాల్ పులికి ప్రభాస్ పేరు..రియల్ లైఫ్ ఎలివేషన్ ఇది.!

Published on Apr 30, 2022 6:02 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్డం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఇప్పుడు గాని ఒక సరైన హిట్ సినిమా పడితే తన సినిమాలు ఈజీగా 1000 కోట్ల వసూళ్లను క్రాస్ చేసేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు కాస్త లైనప్ తడబడినా తన క్రేజ్ మాత్రం శాశ్వతంగా నిలిచిపోయేలా కొనసాగుతూనే ఉంది.

అయితే తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అంశం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. మన స్టార్ హీరోలని సినిమాల్లో ఎలివేట్ చెయ్యడానికి కొన్ని పవర్ ఫుల్ యానిమల్స్ తో పోల్చిన డైలాగ్స్ వింటూ ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో ఒక రాయల్ బెంగాల్ టైగర్ కి ప్రభాస్ అని పేరు పెట్టడం ఆసక్తిగా మారిపోయింది.

ఇది ఇంతకీ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ నెహ్రు జూలాజికల్ పార్క్ లో ఉంది. అక్కడ ఆ పులికి బోర్డు పెట్టి దానికి బ్రాకెట్ లో ప్రభాస్ పేరు కూడా పొందు పరిచారు. ఇలాంటి ఎలివేషన్ లేదా మరో మాట గాని బహుశా ఇండియన్ సినిమా దగ్గర ఓ హీరోకి మొదటి సారి కావచ్చు. దీనితో ఈ అంశం సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :