ఆరోజు అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు వెళ్లాడో తెలుసా..

Published on Sep 22, 2020 3:15 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈమధ్య వార్తల్లో బాగా నానారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నాలుగు రోజుల క్రితం అల్లు అర్జున్ అదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించారని, కోవిడ్ నిబంధనల్లో భాగంగా అన్ని పర్యాటక ప్రాంతాలు మూసివేసి ఉన్నప్పుడు అల్లు అర్జున్ సందర్శనకు ఎలా వెళతారని ఒక సామాజిక కార్యకర్త నెరెడిగొండ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ఆయన పిర్యాదును స్వీకరించిన పోలీసులు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నట్టు తమకు సమాచారం రాలేదని, ఆయన అక్కడికి ఎందుకు వచ్చారో విచారణలో తెలుసుకుని నిబంధనలు అతిక్రమించి ఉంటే చర్యలు తీసుకుంటామమి అన్నారు.

ఆయన పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు సైతం బన్నీ నిజంగా రూల్స్ పాటించలేదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆరోజు అల్లు అర్జున్ అదిలాబాద్ జిల్లాకు వెళ్లింది జలపాతం సందర్శన కోసం కాదని తన స్నేహితుడి గెస్ట్ హౌజ్ ఉంటే అక్కడకు వెళ్లారని, బన్నీ అక్కడికి వచ్చినట్టు తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకుని ఆయన్ను చూడాలని పట్టుబట్టడంతో బన్నీ వారి కోసం బయటికొచ్చి వారిని కలిశారని, అంతేకానీ ఉద్దేశ్యపూర్వకంగా ఆయన నిబంధనలను ఉల్లంఘించలేదని అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇకపోతే బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూట్ రీస్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :

More