కీర్తి సురేష్ ఇంత ధైర్యం చేయడానికి రీజన్..

Published on May 25, 2021 8:11 pm IST

ఎవరైనా స్టార్ హీరోయిన్ స్థాయిలో కొనసాగుతున్నప్పుడు హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తారు తప్ప వేరే పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. చెల్లెలి పాత్రలను చేయడానికైతే ముమ్మాటికీ ఒప్పుకోరు. భారీ రెమ్యూనరేష్ ఆఫర్ చేసినా సోదరి పాత్రలను చేసే సాహసం చేయరు. ఒక్కసారి అలాంటి పాత్రల్లో కనిపిస్తే ప్రేక్షకుల్లో తమ పట్ల ఉన్న అభిప్రాయాలు మారిపోతాయని, హీరోయిన్ ఆఫర్లు తగ్గిపోతాయని వారి భయం. అందుకే హీరోయిన్ మినహా మిగతా పాత్రలకు సైన్ చేయరు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఆ సాహసం చేసింది.

కీర్తి అటు తెలుగు, ఇటు తమిళం రెండు భాషల్లోనూ మంచి పొజిషన్లోనే ఉంది. పెద్ద ఆఫర్లే ఉన్నాయి ఆమెకు. అయినా ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ చేస్తున్న ‘అన్నాత్తే’ చిత్రంలో రజినీకి చెల్లెలిగా నటిస్తోంది. కీర్తి ఇలా చెల్లెలిగా నటించడానికి ఒక బలమైన రీజన్ ఉంది. అదే ఆమె పాత్ర. డైరెక్టర్ శివ రాసుకున్న కథలో చెల్లెలి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందట. ఆ పాత్రే కథను మలుపు తిప్పుతుందట. అందుకే కీర్తి సురేష్ ఆ పాత్రను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇప్పటికే కీర్తి తన పాత్ర తాలూకు షూటింగ్ కూడ పూర్తిచేసింది. లాక్ డౌన్ అనంతరం కొద్దిరోజుల చిత్రీకరణతో సినిమా పూర్తికానుంది. ఇకపోతే కీర్తి తెలుగులో మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :