‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆలస్యానికి కారణం ఏమిటో చెప్పిన చైతూ
Published on Oct 5, 2016 3:02 pm IST

naga-chaitanya1
అక్కినేని హీరో నాగ చైతన్య ఈ సంవత్సరం రెండు సినిమాలో నటించాడు. అందులో ఒకటి ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం ఒకటి. కొంతకాలం క్రితమే విడుదలైన పాటలు, ట్రైలర్స్ బాగుండటంతో గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ చిత్రం తరువాత చిత్రీకరించిన ‘ప్రేమమ్’ కూడా రిలీజవుతుంటే దీనికి మాత్రం ఇప్పటికీ ఖచ్చితమైన రిలీజ్ డేట్ ఇంకా కుదరలేదు. మొదట రెండు సినిమాల్ని ఒకే నెలలో రిలీజ్ చేస్తే సమస్యగా ఉంటుందని భావించి గౌతమ్ మీనన్ సినిమాని వాయిదా వేశామని చెప్పారు.

కానీ తాజాగా ‘ప్రేమమ్’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో దీని గురించి అడగ్గా చైతు ‘ఈ సినిమానై తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనేది మా ఆలోచన. కానీ తమిళంలో డబ్బింగ్ పూర్తి కాకపోవడం వలన సినిమా ఆలస్యమవుతోంది. తెలుగులో ఎలాంటి ఇబ్బంది లేదు. సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుంది’ అన్నారు. ఇకపోతే ‘ప్రేమమ్’ ఈ నెల 7వ తేదీన విడుదల కానుంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook