భయం, బెరుకు ఉండదంటున్న నాగశౌర్య

Published on Jun 9, 2019 7:51 pm IST

యంగ్ హీరో నాగశౌర్య చేస్తున్న సినిమాల్లో ‘అశ్వద్దామ’ కూడా ఒకటి. రమణ తేజ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. టైటిల్ విని ఇదేదో పౌరాణిక చిత్రం అనుకుంటే పొరపాటే. సినిమాకు ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఇందులో కథానాయకుడి పాత్ర మహాభారతంలోని ముఖ్యపాత్రల్లో ఒకటైన అశ్వద్దామా పాత్రను పోలి ఉంటుందట.

అశ్వద్ధామ స్వతహాగా అన్యాయాన్ని ప్రశ్నించి, ఎదిరించే ధీరత్వం కలవాడు. ఆ తరహాలోనే సినిమాలో నాగశౌర్య పాత్ర కూడా ప్రతి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఉంటుందట. అదే సినిమా కథకు మూలమట. మరి ఇలాంటి హీరోయిక్ పాత్రలో శౌర్య ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసిన టీమ్ త్వరలోనే రెండవ షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ సినిమాను నాగశౌర్య స్వయంగా తన ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More