మరో పాపులర్ ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ నోస్టాల్జిక్ హిట్ ‘గుర్తుకొస్తున్నాయి’.. ఎందులో అంటే

మరో పాపులర్ ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ నోస్టాల్జిక్ హిట్ ‘గుర్తుకొస్తున్నాయి’.. ఎందులో అంటే

Published on Jul 10, 2026 11:05 AM IST

ఈ మధ్య కాలంలో వింటేజ్ మూమెంట్స్ మెయిన్ గా 90స్ నేపథ్యంలో పలు వెబ్ సిరీస్ లు సినిమాలు వస్తుండడం చూస్తూనే ఉన్నాం. దాదాపు అవి హిట్ కూడా అయ్యాయి. అలా రీసెంట్ గా వచ్చిన మరో బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ నే గుర్తుకొస్తున్నాయి. మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ వారు తీసుకొచ్చిన ఈ వెబ్ సిరీస్ కి మంచి టాక్ వచ్చి హిట్ అయ్యింది.

ఇలా అందులో మంచి ఆదరణ అందుకున్న ఈ సిరీస్ ఇపుడు మరింత విస్తరించేలా దిగ్గజ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు వచ్చేసింది. ఇందులో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. ఇక ఈ సిరీస్ లో విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి తదితరులు నటించగా వినోద్ గాలి దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ కి శరత్ చంద్రనాయుడు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు