రికార్డ్ ఫిగర్ కు “సర్కారు వారి పాట” ఆడియో రైట్స్.!

Published on Jul 31, 2021 10:21 am IST

ఇప్పుడు సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” మ్యానియా నే నడుస్తుంది. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు ఒక లెక్కలో ఎదురు చూస్తుండగా మేకర్స్ ఒక్కో అప్డేట్ ను వదులుతూ వస్తున్నారు.

మరి అలా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేస్తుండగా నిన్ననే ఈ సినిమా ఆడియో అమ్ముడుపోయాయని క్లారిటీ ఇచ్చారు. సరిగమ సౌత్ వారు ఈ చిత్రం తాలూకా ఆడియో హక్కులను దక్కించుకోగా ఇప్పుడు ఈ రైట్స్ ఇంతకీ అమ్ముడుపోయాయో అన్నది తెలుస్తుంది. ఈ చిత్రం ఆడియో హక్కులు మొత్తం నాలుగున్నర కోట్లకు అమ్ముడుపోయాయని నయా టాక్..

అంతే కాకుండా ఇదే ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఒక నాన్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో అత్యధికం అన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే థమన్ ఇస్తున్న ఆల్బమ్ పై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఆల్బమ్ ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :