భారీ ధరకు అమ్ముడైన పవన్ సినిమా శాటిలైట్ రైట్స్ !

PSPK25

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీ ప్రమోషన్ మొదలయ్యాయి. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కు మంచి స్పందన లభించింది. పవన్ & త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీవర్గాల్లో అంచనాలు భారీ స్థాయికి చేరుకోగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారి ధరకు అమ్ముడు అయినట్లు సమాచారం.

స్టార్ మా ఈ సినిమా రైట్స్ కోసం 15 కోట్లు ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. జి తెలుగు కూడా ఈ పోటిలో ఉండగా జెమిని టివి 19 కోట్లకు ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. డిసెంబర్ రెండోవారంలో ఆడియో విడుదల కానున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version