బాలీవుడ్ సినిమాకు షూటింగ్ మొదలుపెట్టిన రెజినా !

10th, April 2018 - 08:49:34 AM

ఇటీవలే ‘అ!’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన హీరోయిన్ రెజినా కాసాండ్రా ఒకవైపు తమిళ చిత్రం ‘మిస్టర్ చంద్రమౌళి’లో నటిస్తూనే తన మొదటి హిందీ చిత్రం ‘ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా’ యొక్క షూటింగ్ కూడ మొదలుపెట్టారు. ఈ షూటింగ్ ఈరోజే పాటియాలలో మొదలైంది.

షెల్లీ చోప్ర దర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సోనమ్ కపూర్, అనిల్ కపూర్, జుహీ చావ్లా, రాజ్ కుమార్ రావ్ వంటి స్టార్ నటీనటులు నటిస్తున్నారు. రెజినా ఇది వరకే అమితాబ్ బచ్చన్ తో కలిసి ఒక హిందీ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన అది కాస్త ఆగిపోయింది.