ఇంటర్వ్యూ : రెజీనా – ‘ఎవరు’లో నా రోల్ పూర్తి సంతృప్తినిచ్చింది !

Published on Aug 12, 2019 5:04 pm IST

వెంక‌ట్ రామ్‌జీ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా రెజీనా కాసాండ్రా హీరోయిన్‌ గా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. కాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. కాగా ఈ సందర్భంగా రెజీనా కాసాండ్రా మీడియాతో మాట్లాడారు. మరి ఈ సినిమా గురించి రెజీనా కాసాండ్రా వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు రెజీనా మాటల్లోనే..

‘ఎవరు’లో మీరు ఎలా జాయిన్ అయ్యారు ?

 

పీవీపీగారు కాల్ చేశారు. వెంక‌ట్ రామ్‌జీ అనే కొత్త దర్శకుడు కథ చెప్తారు. వినండి, మీకు నచ్చితే చేద్దాం అని. వెంక‌ట్ రామ్‌జీ వచ్చి నాకు కథ చెప్పారు. నాకు చాల బాగా నచ్చింది. వెంటనే నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను.

 

మీ పాత్ర గురించి ?

 

సమీరా అనే పాత్రలో నేను ఈ సినిమాలో కనిపిస్తాను. సమీరా పేస్ లో పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ కనబడవు. వెంక‌ట్ రామ్‌జీ నన్ను దృష్టిలో పెట్టుకునే ఆ రోల్ రాశాను అని చెప్పినప్పుడు నాకు చాల హ్యాపీగా అనిపించింది. నా కెరీర్ లో మంచి క్యారెక్టర్స్ లోనే యాక్ట్ చేశాను. కానీ ఈ సమీరా రోల్ పూర్తి సంతృప్తినిచ్చింది.

 

అసలు ఈ సినిమా కథ ఏమిటి.. ఎవరు చుట్టూ తిరుగుతుంది ?

 

టైటిల్ లోనే ఉంది కదా ‘ఎవరు’ అని. అది సినిమాలోనే చూసి తెలుసుకోండి. అయితే సమీరా అనే అమ్మాయి లైఫ్ లో ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏమిటి.. ఆ ఇన్సిడెంట్ పై ఎలాంటి విచారణ జరిగింది.. చివరికీ సమీరా లైఫ్ ఎలాంటి మలుపు తిరుగుతుంది లాంటి థ్రిల్లింగ్ అంశాలు సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి.

 

ఎందుకు మీరు పెద్ద సినిమాలు చెయ్యలేకపోతున్నారు ?

 

నేను ఇండస్ట్రీకి వచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది అండి. నా కెరీర్ పట్ల హ్యాపీగానే ఉన్నాను. నా వరకూ నా దగ్గరకి వచ్చిన రోల్స్ ను సెలెక్ట్ చేసుకొని బాగానే చేస్తున్నాను. ఇక పెద్ద సినిమాలు చెయ్యలేకపోవటానికి కారణం ఏమిటో నాకు తెలియదు. అయినా నేను మంచి సినిమాలు.. కొన్ని సూపర్ హిట్ సినిమాలే చేశాను.

 

వెంక‌ట్ రామ్‌జీ కొత్త దర్శకుడు. తనతో పని చేయడం ఎలా అనిపించింది ?

 

ఎప్పుడైనా ఒక కొత్త డైరెక్టర్ పై నమ్మకం కుదరాలంటే.. ముందుగా ఉన్న ఏకైక మార్గం ఆ డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ నే. వెంక‌ట్ రామ్‌జీ నాకు రెండు గంటలు పాటు ‘ఎవరు’ స్క్రిప్ట్ చేప్పినప్పుడే నాకు రామ్‌జీ పై పూర్తి నమ్మకం కుదిరింది. తను సినిమాను చాల బాగా తీసాడు. వెరీ టాలెంటెడ్ పర్సన్. సినిమా అందర్నీ ఆకట్టుకుంటుంది.

 

‘అడివి శేష్’తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ?

 

ఫస్ట్ ‘అడివి శేష్’ అమేజింగ్ అండి. మంచి యాక్టర్. తనతో వర్క్ చేసినందుకు చాల హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చేస్తున్నంత సేపూ బాగా ఎంజాయ్ చేశాను.

 

మీరు బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా ?

 

కథను బట్టే నండి. స్క్రిప్ట్ లో నిజంగా బోల్డ్ నెస్ ఖచ్చితంగా ఉండాలని డిమాండ్ చేస్తే మాత్రం.. చేస్తాను. చెయ్యను అనేది ఏమిలేదు. అయితే బోల్డ్ నెస్ కోసం అవసరం లేకపోయినా.. ఎదో బోల్డ్ గా కనిపించాలంటే మాత్రం అలాంటివి చేయడమే వేస్ట్.

 

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

 

తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను. ఇక తెలుగులో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, ప్రస్తుతం అవ్వన్నీ చర్చల దశలో ఉన్నాయి. అలాగే హిందీలో కూడా త్వరలో ఓ సినిమా ఫైనల్ అవ్వనుంది.

సంబంధిత సమాచారం :