సాయి తేజ్ “రిపబ్లిక్” కి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Aug 15, 2021 4:33 pm IST

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాడు. మరి ఈ పరంపర కొనసాగించాలనే విలక్షణ దర్శకుడు దేవా కట్ట తో స్టార్ట్ చేసిన లేటెస్ట్ సినిమానే “రిపబ్లిక్”. ఆసక్తికర బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు కూడా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఈ సినిమా నుంచి ప్రామిసింగ్ గా అనిపించింది.

అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పటికే రెలీసీ చెయ్యాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఇది కూడా వాయిదా పడింది. మళ్ళీ ఓటిటి లోకి వస్తుంది ఏమో అని టాక్ వచ్చినా ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ పై మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చేసారు. మరి ఈ చిత్రాన్ని ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా వచ్చే అక్టోబర్ 1న థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

అలాగే ఈ చిత్రంలో సాయి తేజ్ ఒక జిల్లా కలెక్టర్ గా కనిపించనున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జేబీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :