మలయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కి ఒక్క మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా మన దగ్గర కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగు రిలీజ్ కూడా అవుతూ ఉంటాయి. అయితే దుల్కర్ నటిస్తున్న అవైటెడ్ సాలిడ్ యాక్షన్ మాస్ ప్రాజెక్ట్ ఐ యాం గేమ్ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఇపుడు వినిపిస్తుంది.
దర్శకుడు నహాష్ హిదాయత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఆగస్టు 20న థియేటర్స్ లో పలు భాషల్లో విడుదల కానున్నట్లు సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. సో దుల్కర్ నుంచి కాంత లాంటి ప్లాప్ తర్వాత ఈ సినిమాతో తను బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అనేది అప్పటి వరకు వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి నిర్మాణం కూడా దుల్కర్ అందిస్తుండగా తనతో సాలిడ్ ట్రాక్ రికార్డ్ ఉన్న జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నాడు.


