విడుదల తేదీని ఖరారు చేసుకున్న ‘గీతా గోవిందం’ !

Published on Jul 3, 2018 8:55 am IST

యువ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నలు కలిసి చేస్తున్న చిత్రం ‘గీతా గోవిందం’. టైటిల్స్, ఫస్ లుక్ పోస్టర్లతో కొంచెం డిఫరెంట్ మూవీ అనే క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

కొద్దిసేపటి క్రితమే ఈ విషయాన్ని దేవరకొండ అధికారికంగా ప్రకటించారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాస్ నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. గోపి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దేవరకొండ, రష్మికలు మొదటిసారి కలిసి చేస్తుండటంతో ఈ సినిమాపై యువతలో మంచి బజ్ ఉంది.

సంబంధిత సమాచారం :