రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సాయి పల్లవి సినిమా !

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకుని బోలెడంత క్రేజ్ ను సంపాదించుకున్న నటి సాయి పల్లవి ఆచి తూచి సినిమాలో సైన్ చేస్తూ జాగ్రత్తగా కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది. ఇటీవల ఆమె నానితో కలిసి చేసిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ కూడా మంచి విజయాన్ని అందుకోగా ఆమె మరొక చిత్రం ‘కణం’ కూడా విడుదలకు సిద్ధమైంది.

చాలా రోజుల్ క్రితమే రిలీజ్ కావల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదాపడి ఎట్టకేలకు కొత్త ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ఎన్వీఆర్ సినిమాస్ అధినేత ఎన్వీ ప్రసాద్ ఫ్యాన్సీ రేటుకి కొనుగోలుచేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ ద్విభాషా చిత్రంలో ఇటీవలే ‘ఛలో’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నాగ శౌర్య నటించడం విశేషం.