ఖాయమైన ‘సవ్యసాచి’ రిలీజ్ డేట్ !

Published on Jul 3, 2018 9:27 am IST

అక్కినేని హీరో నాగ చైతన్య ‘సవ్యసాచి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇంకొంత మాత్రమే మిగిలున్న షూటింగ్ ఈ జూలై 9 నుండి మొదలై 10 రోజుల పాటు జరగనుంది. ఇందులో నాగ చైతన్యతో పాటు నిధి అగర్వాల్, భూమికలు పాల్గొననున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 10న టీజర్ విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఇక చిత్రం మాత్రం ఆగష్టు 17వ తేదీన విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడ చివరి దశకు చేరుకోవడంతో రెండు సినిమాల విడుదలకు మధ్య మంచి గ్యాప్ ఉండాలంటే ‘సవ్యసాచి’ని త్వరగా రిలీజ్ చేయాలి. అందుకే మేకర్స్ ఆగష్టు మూడవ వారాన్ని టార్గెట్ చేశారు. చందూ మొండేటి దశకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం :