“RRR” రిలీజ్ పై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్.!

“RRR” రిలీజ్ పై స్ప్రెడ్ అవుతున్న రూమర్స్.!

Published on Aug 6, 2021 1:15 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో దర్శక దిగ్గజం రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాంగ్ మరియు పలు కీలక సన్నివేశాల నిమిత్తం ఉక్రెయిన్ దేశానికి పయనం అయ్యి వెళ్లారు.

మరి ఈ షూట్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం మొదటి నుంచి కూడా రిలీజ్ డేట్ విషయంలో అనేక మార్లు క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. మరి ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దోస్తీ వరకు కూడా అక్టోబర్ 13 నే ఈ చిత్రం రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని కన్ఫర్మ్ చేసారు. కానీ వారి ఊహలకు అందకుండా ఇప్పుడు పలువురు రూమర్స్ స్ప్రెడ్ చేస్తుండడం వైరల్ అవుతుంది.

సినిమాకి బ్యాలన్స్ షూట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు బేరీజు వేసుకుంటే అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లేదని ఎవరికి నచ్చిన థియరీలు వారు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాదికి ఈ చిత్రం షిఫ్ట్ అయ్యిందని కూడా చెప్పుకుంటున్నారు. మరి వీటన్నిటికీ చెక్ చెప్పాలి అంటే మళ్ళీ ఈ చిత్రం నుంచి వచ్చే ఏదొక పోస్టర్ లో మళ్ళీ డేట్ వేసి కన్ఫర్మ్ చెయ్యాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు