
సౌత్ ఇండియన్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘రోబో’. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టడమే కాకుండా ఎన్నో రికార్డ్స్ సృష్టించింది. చాలా కాలంగా ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ తీయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు.
తాజా సమాచారం ప్రకారం రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సినిమా సీక్వెల్ తీయడానికి మరింత ఆసక్తి చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే డైరెక్టర్ గా శంకర్ మరియు వశీ, చిట్టి పాత్రల్లో రజినీకాంత్ నే తీసుకునేలా రిలయన్స్ వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కానీ శంకర్ ప్రస్తుతం విక్రమ్ ‘ఐ’ సినిమాకి తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు, అలాగే రజినీ కాంత్ కూడా ‘లింగా’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ ఈ చిఎన్మాలు పూర్తి చేసాక రోబో సీక్వెల్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.