మిడ్ నైట్ రన్నర్స్ ను తెలుగులో రీమేక్ చేస్తున్న సుధీర్ వర్మ!

Published on Jul 26, 2021 2:20 pm IST

కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ చిత్రాన్ని తెలుగు లోకి తీసుకు వస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ మరియు క్రాస్ పిక్చర్స్. అయితే ఓ బేబీ చిత్రం తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ రిపీట్ కానుంది. అయితే ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ప్రధాన పాత్రల్లో రెజీనా కాసాండ్రా మరియు నివేధా థామస్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దగ్గుబాటి సురేష్ బాబు మరియు సునీత తాటి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :