బాలయ్య సినిమాలో ఎన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్
Published on Jun 12, 2017 6:14 pm IST


గత కొంత కాలంగా టాలీవుడ్ లో రీమిక్స్ ల పర్వం సాగుతోంది.సూపర్ హాట్ అయిన పాత చిత్రాలలోని పాటలను రీమిక్స్ చేసి తమ చిత్రాలలో పెట్టుకుంటున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న పైసా వసూల్ చిత్రంలో కూడా ఓ పాటని రీమిక్స్ చేయనున్నారు. సీనియర్ ఎన్టీఆర్ జీవిత చక్రం చిత్రంలోని ‘ కంటి చూపు చెబుతోంది’ అనే పాటని పైసా వసూల్ చిత్రంలో ఉపయోగించుకోనున్నారు.

ఈ చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఇప్పటికే ఈ పాటని పూర్తి చేశాడు.ఈ సాంగ్ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం.ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ యూరప్ లో జరుగుతోంది. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీయ హీరోయిన్ గా నటిస్తోంది.దసరా కానుకగా సెప్టెంబర్ 29 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 
Like us on Facebook