మానసిక దాడుల పై ‘రేణు దేశాయ్’ సినిమా !

Published on Oct 26, 2020 11:02 am IST

‘రేణు దేశాయ్’ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సామాజిక స‌మ‌స్య‌ల‌ పై స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాలతో బిజీగా ఉంది. వెన్ సిరీస్ ల్లో సినిమాల్లో నటిస్తూనే దర్శకత్వం కూడా చేస్తోంది. ప్రస్తుతం రేణు దేశాయ్ తెరకెక్కించబోయే సినిమా కథ రైతు కథాంశంతో సాగుతుందని.. రైతుల స్థితిగతులు, జీవన విధానం పరిశోధించి మరీ రేణూ దేశాయ్ ఎన్నో విషయాలను రిసెర్చ్ చేసి.. ఆమె రైతు సినిమా తీస్తుందట. ఇక ఈ సినిమా తరువాత చేయబోయే సినిమా గురించి ఆమె క్లారిటీ ఇచ్చింది.

మ‌హిళ‌ల పై జరిగే మానసిక దాడులను తీవ్ర స్థాయిలో నిర‌సిస్తూ ఆడవారిని చైత‌న్య‌ప‌రిచే విధంగా తాను ఓ సినిమాను కూడా చేస్తానంటుంది.
నా తరువాత సినిమాలో ఆడవారి రక్షణకు సంబదించిన అంశాల పై సినిమా చేద్దామనుకుంటున్నాను. మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలరు’ అనే కథాంశంతో ఆడవాళ్ళల్లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేయాలని ఉంది. అంటూ రేణు చెబుతుంది. ఇప్పటికే మరాఠీలో ‘రేణు దేశాయ్’ ఒక సినిమాని డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More