“రిపబ్లిక్” లో దశరథ్ గా జగ్గూ భాయ్!

Published on Aug 9, 2021 10:04 pm IST

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. దేవ కట్టా మరొకసారి పాత్రల తోనే సినిమా పై ఆసక్తి పెంచుతున్నారు. ఈ చిత్రం లో జగపతి బాబు దశరథ్ పాత్రలో నటిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది అంటూ కొటేషన్ తో జగపతి బాబు కి సంబందించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

జే బీ ఎంటర్ టైన్మెంట్స్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :