టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘రిపబ్లిక్’ !

Published on Apr 5, 2021 11:50 am IST

మెగా హీరో సాయి తేజ్ చేస్తోన్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కాగా తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ కాలంలో మన జీవితాల నుండి రాజకీయాలను వేరు చేయలేము అనే టెక్స్ట్ కార్డుతో మొదలైన ఈ టీజర్ లో దేవకట్ట తాలూకు మార్క్ చాల స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా సాయి తేజ్ వాయిస్ ఓవర్ తో పాటు రమ్యకృష్ణ ఎలివేషన్ షాట్స్ అలాగే వ్యవస్థ పై చెప్పించిన డైలాగ్స్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి.

ఇన్నాళ్లు యూత్ ఫుల్ ఎంటెర్టైనర్లు చేస్తూ వచ్చిన సాయి తేజ్ మొదటిసారి చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. రాజకీయం, ప్రజాస్వామ్యం, ప్రజలు లాంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించి 74 ఏళ్లు అవుతుంది. డెబ్బై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం, కానీ ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలీదు మనకు అంటూ హీరో చేసే పోరాటమే సినిమా కథ.

జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావులు నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ ఒక కీ రోల్ చేస్తుండగా ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది. జూన్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. తేజ్ తొలిసారి రొమాంటిక్, కమర్షియల్ జానర్లను పక్కనబెట్టి చేస్తున్న సబ్జెక్ట్ కావడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :