యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేసిన ఛార్మీ.!

యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేసిన ఛార్మీ.!

Published on Oct 6, 2015 10:00 AM IST

revathi
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ‘జ్యోతి లక్ష్మీ’ సినిమాతో చాలా రోజుల తర్వాత హాట్ బ్యూటీ ఛార్మీ హిట్ ని అందుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా మారింది. ఆ సినిమా తర్వాత పూరితి కలిసి నిర్మాతగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిన ఛార్మీ ప్రస్తుతం స్వతహాగా ఓ సినిమాని నిర్మించడానికి సిద్దమైంది. అందుకోసం వరుసగా రెండు హిట్స్ అందుకున్న యంగ్ హీరోని ఫైనలైజ్ చేసింది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా సినిమాతో వరుస హిట్స్ అందుకున్న హీరో రాజ్ తరుణ్.

ఛార్మీ తన సినిమా కోసం రాజ్ తరుణ్ కి హీరోగా సెలక్ట్ చేసింది. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ గా విలక్షణ నటి రేవతిని డైరెక్టర్ గా ఎంచుకుంది. ఇప్పటికే హిందీ, మలయాళం, ఇంగ్లీష్ లో సినిమాలు చేసిన రేవతిని తెలుగులో తన సినిమా ద్వారా డైరెక్టర్ గా లాంచ్ చేయడానికి సిద్దమైంది. పూరి జగన్నాధ్ కూడా రేవతిని డైరెక్షన్ చేయమని చెబుతూ, ఆ సినిమాకి స్క్రీన్ ప్లేని కూడా అందించనున్నాడు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు