
మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా రెండవ సినిమాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకనిర్మాత అయిన వైవిఎస్ చౌదరి మెగా ఫ్యామిలీ హీరో అయిన సాయి ధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘రేయ్’. ఈ సినిమా వాయిదా పడడం వల్ల సాయి ధరమ్ తేజ్ రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ ముందే రిలీజ్ అయిపోవడమే కాకుండా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అన్ని ఫైనాన్సియల్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాని మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ‘రేయ్ విత్ పవనిజం’ అనే ఓ స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం ఈ స్పెషల్ పవనిజం సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ ని సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత సినిమాలో యాడ్ చేస్తారు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ఓ డాన్సర్ లా కనిపిస్తాడు. డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసేలా ఈ సినిమాలో అదిరిపోయే స్టెప్స్ తో మెగా అభిమానులకు పెద్ద ట్రీట్ ఇవ్వనున్నాడని ఈ సినిమా చూసిన కొందరు చెబుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ హీరోయిన్స్ గా నటించారు. వైవిఎస్ చౌదరి నిర్మించిన ఈ సినిమాని ఎక్కువ భాగం కరేబియన్ దీవులు, కాలిఫోర్నియాలో షూట్ చేసారు. స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు.

