అషురెడ్డి చెంప దెబ్బ కొట్టడం పై ఆర్జీవీ ఏమన్నారంటే?

Published on Sep 3, 2021 11:26 pm IST


వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుస ఇంటర్వ్యూ లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అరియాన తో చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ కొల్లగొట్టింది. అయితే రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ అంటూ ఒక కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.

అషు రెడ్డి తో చేయబోయే ఇంటర్వ్యూ లో ఆర్జీవీ ను చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో తో ఆర్జీవీ పై మళ్ళీ చర్చలు మొదలు అయ్యాయి. అయితే ఈ చెంప దెబ్బ పై ఆర్జీవీ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇది చాలా హాస్యాస్పదం గా ఉన్నట్లు మీకు అనిపించడం లేదా అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :