‘ఆఫీసర్’పై క్లారిటీ ఇచ్చిన వర్మ !

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆర్జీవీ దర్శకత్వంలో ‘ఆఫీసర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో మొదలైన చిత్రీకరణను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస షెడ్యూళ్లతో శరవేగంగా ముగించేశారు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని వర్మ ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టేకెన్’ను స్ఫూర్తిగా తీసుకుని రూపొందిస్తున్నారని, చిత్రం చాలా వరకు అలానే ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ వర్మ వాటిని కొట్టిపడేశారు. చిత్రంలో నాగార్జున పోలీస్ కావడం, అతనికో కుమార్తె ఉండటం వంటి అంశాలు మాత్రమే రెండింటిలోను ఒకలా ఉంటాయని మిగతా విశషయాల్లో ‘టేకెన్’కు దీనికి అస్సలు పోలిక ఉండదని క్లారిటీ ఇచ్చారు.