‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు !

Published on Mar 1, 2019 1:07 am IST

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో చాలా రోజుల నుంచీ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. వెన్నుపోటు పాటతో మొదలు పెట్టి ఆ తరువాత టీజర్, ట్రైలర్ లతో వివాదాలకు బాగానే పునాది వేశాడు ఆర్జీవీ. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సినిమాకి బాగానే హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

కాగా తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం హక్కుల్ని అమ్మేశారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. వీటి పై స్పందించిన వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ హక్కుల్ని అమ్మేశారని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని వర్మ చెప్పాడు. ఒకవేళ హక్కుల్ని అమ్మితే సోషల్ మీడియా ద్వారా అయిన తనే స్వయంగా తేలుపుతానని చెప్పాడు.

ఇక ఈ చిత్రం మార్చి 22వ తేదీన విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ తేజ్, చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తుండగా.. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో నటించిన ప్రముఖ కన్నడ నటి యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :