ప్రయోగాత్మక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన వర్మ.

RGV
వర్మ అభిమానులకు శుభవార్త..! గత కొంత కాలంగా ప్రయోగాత్మక సినిమాలు, లో బడ్జెట్ తీస్తూ… వరుస ప్లాపులు ఎదుర్కున్న వర్మ, ఇకపై వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. నిజానికి ‘దొంగల బండి’, ‘ఐస్ క్రీం’ సిరీస్ ఇలా.. వర్మ తీసిన నాసిరకం సినిమాలు అభిమానులను, ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి. జీరో బడ్జెట్, ప్రాఫిట్ షేరింగ్ అంటూ వార్తలలో నిలవడం తప్ప ఆ సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. అటువంటి సినిమాలకు స్వస్తి పలికి, తనదైన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ లోకి వచ్చేశానని సోషల్ మీడియాలో వర్మ తెలిపారు.

ప్రస్తుతం మంచు మనోజ్, సురభి జంటగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎటాక్'(వర్కింగ్ టైటిల్) భారి బడ్జెట్ సినిమా అట. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం.. పురానాపూల్ బ్రిడ్జ్ మీద దాదాపు 1000 మంది పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ను రెయిన్ ఎఫెక్ట్ లో తియ్యబోతున్నానని వర్మ ప్రకటించారు.

ఈ భారి బడ్జెట్ సినిమాకు నిర్మాత కూడా వర్మ గారే. సి.కళ్యాణ్ కేవలం ఫైనాన్షియర్ అని మంచు మనోజ్ ట్విట్టర్లో తెలిపారు.

Exit mobile version