సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ “కనబడుటలేదు” పాటపై ఆర్జీవీ కామెంట్..!

Published on Jul 22, 2021 12:38 am IST

వివాదస్పద సినిమాల దర్శకుడు “ఆర్జీవీ” ఎప్పుడు కూడా పాజిటివ్ కామెంట్స్ చేయడన్నది మనకు తెలిసిందే. అయితే తొలిసారిగా ఓ ప్రేమ పాటకు ఆయన ఫిదా అయ్యాడు. సునీల్‌ కీలకపాత్రలో బాలరాజు ఎం. దర్శకత్వంలో సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘కనబడుటలేదు’. వైశాలీరాజ్‌, సుక్రాంత్‌, హిమజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘తొలిసారి నేనే’ అనే పాటను కాజల్‌ విడుదల చేశారు. ఈ పాట లిరికల్‌ వీడియోని షేర్‌ చేసిన ఆర్జీవీ పాట సూపర్‌గా ఉందంటూ, చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం త్వరలో ‘స్పార్క్‌’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :