వర్మ అమితాబ్‌ను కదిలిస్తున్నాడా ?

Published on Jun 8, 2021 10:04 pm IST

రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో చాలా సినిమాలే చేశారు. అయితే వాటిలో ఏవీ కూడ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ఆయన ప్రకటించిన సినిమాలు కొన్నింటి అప్డేట్స్ ఇప్పటివరకు అసలు బయటకి రానేలేదు. ఒకప్పుడు వర్మ సినిమాలాంటే విపరీతంగా ఇష్టపడిన అనేకమంది ఈమధ్య ఆయన నుండి వస్తున్న కంటెంట్ చూసి విసుగెత్తిపోయారు. ఇతను ఒకప్పటి ఆర్జీవీయేనా అంటున్నారు. వర్మ మాత్రం సినిమాలు అప్పుడెలా తీశానో ఇప్పుడూ అలానే తీస్తున్నాను అంటున్నారు. కానీ అప్పుడు మెచ్చిన ప్రేక్షకులు ఇప్పుడు ఆయన సినిమాలను రిసీవ్ చేసుకోలేకున్నారు.

ఇలా వర్మ నుండి ఇకపై సీరియస్ సినిమాలను ఆశించనక్కర్లేదనే అభిప్రాయంలోకి ప్రేక్షకులు వెళ్ళిపోయిన తరుణంలో ఒక వార్త అందరికీ ఆసక్తిని రేపుతోంది. అదేమిటంటే వర్మ అమితాబ్ బచ్చన్ తో సినిమా తీసే
ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. వర్మ అమితాబ్ కోసం ఆసక్తికరమైన కథను రెడీ చేశారని, వినిపించడం కూడ జరిగిందని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే గనుక వర్మ నుండి చాలా ఏళ్ల తరవాత ఒక మంచి సినిమాను ఆశించవచ్చు. ఎందుకంటే మిగతా సినిమాల్లో చేసినట్టు అమితాబ్ సినిమాలో ఆషామాషీ వ్యవహారాలకు వీలుండదు కాబట్టి. గతంలో వర్మ అమితాబ్‌తో ‘సర్కార్, సర్కార్ రాజ్, సర్కార్ 3’ లాంటి సినిమాలు చేశారు.

సంబంధిత సమాచారం :