ఫస్ట్ లుక్ తో సిద్ధంగా ఉన్న వర్మ !

ఫస్ట్ లుక్ తో సిద్ధంగా ఉన్న వర్మ !

Published on Jun 21, 2018 1:25 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస పరాజయాల తర్వాత చేస్తున్న చిత్రం ‘భైరవగీత’. ఈ చిత్రం గురించి వర్మ మాట్లాడుతూ ఇదొక హింసాత్మమైన ప్రేమ కథాగా ఉండబోతుందని అన్నారు. వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేయనున్నాడు.

‘తగరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ధనుంజయ చేయనున్న పాత్ర గురించి, అందులో అతని నటన గురించి చాలా గొప్పగా చెబుతూ వచ్చిన వర్మ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదలచేయనున్నారు. ఈ చిత్రం ఒకేసారి రెండు భాషల్లో రూపొందనుంది. ఇది కాకుండా వర్మ కొన్ని రోజుల్ క్రితం ‘వైరస్’ అనే మరోక సినిమాను కూడ అనౌన్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు