రాయలసీమ ఫ్యాక్షన్ల పై ఆర్జీవీ వెబ్ సిరీస్…హిందీ, తెలుగు బాషల్లో విడుదల కానున్న కడప్ప!

Published on Aug 8, 2021 7:05 pm IST

వివాదాల దర్శకుడు గా పేరోందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరొకసారి నిజ జీవితాలకి దగ్గరగా ఉన్న వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ల పై వెబ్ సిరీస్ ను తీస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అందుకు సంబంధించిన స్నేక్ పీక్ ను సైతం విడుదల చేశారు. వెబ్ సిరీస్ కి కడప్ప గా టైటిల్ పెట్టడం జరిగింది.

రాయల సీమ లో పగల మూలంగా వందల మంది ప్రాణాలు బలి తీసుకున్న ఫ్యాక్షన్ వార్ ల నేపథ్యం లో తీస్తున్న మెగా వెబ్ సిరీస్ కి సంబందించిన వీడియో అంటూ చెప్పుకొచ్చారు. నేషనల్ లెవెల్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే మరొకసారి రామ్ గోపాల్ వర్మ ఇలాంటి టైటిల్ ను అనౌన్స్ చేయడం తో ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :