స్టీవెన్ స్పీల్ బర్గ్ ని కలవనున్న రామ్ గోపాల్ వర్మ

స్టీవెన్ స్పీల్ బర్గ్ ని కలవనున్న రామ్ గోపాల్ వర్మ

Published on Mar 11, 2013 9:00 PM IST

Ram-Gopal-Varma1
ప్రపంచం గర్వించదగ్గ డైరెక్టర్లలో ఒకరైనా స్టీవెన్ స్పీల్ బర్గ్ బాలీవుడ్లో కొందరు ప్రముఖులని కలవనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత అనీల్ అంబాని ఆహ్వానం మేరకు ఆయన ఇండియా రానున్నాడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ , డ్రీమ్ వర్క్స్ స్టూడియోస్ పేరు మీద అమెరికాలో చాలా ప్రాజెక్ట్స్ చేపట్టింది. ఆ డ్రీం వర్క్స్ స్టూడియోస్ సంస్థలో స్టీవెన్ స్పీల్ బర్గ్ ఒకరు.’కౌ బాయ్స్ & ఎలియాన్స్’, ‘ది హెల్ప్’, ‘రియల్ స్టీల్’, ‘ది ఫైటర్’ చిత్రాలే కాకుండా ఆయన తీసిన ‘లింకన్’ మరియు ‘వార్ హౌస్’ సినిమాలను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ మీదే తెరకెక్కాయి.

గత కొద్ది సంవత్సరాలుగా సినీ రంగంలో జరిగిన మెలుకువలు ఇచ్చి పుచ్చుకోవడానికి స్పీల్ బర్గ్ అతి తక్కువ మందితో ముచ్చటించడానికి అంగీకరించాడు. వాళ్ళలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. నిజంగా రామూ రామ్ గోపాల్ వర్మ ని కలవడం తనకు లభించిన గౌరవమనే చెప్పాలి. తను తెలుగు, హిందీ భాషల్లో ఇంత పెద్ద డైరెక్టర్ కావడానికి స్పీల్ బర్గ్ ప్రభావం తనపై ఉందని రామూ చాలా సార్లు చెప్పాడు.

రామూతో పాటుగా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ, అనురాగ్ కశ్యప్, ఆమిర్ ఖాన్, ఫర్హాన్ అఖ్తర్, జోయ అఖ్తర్, అభిషేక్ కపూర్, హబీబ్ ఫైసల్, ప్రభు దేవా, సంజయ్ లీల బన్సాలి, ఫరా ఖాన్ లు స్పీల్ బర్గ్ ని కలవనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు