బ్రూస్ లీ సొంత నగరంలో ఆర్జీవీ సినిమా ట్రైలర్ విడుదల

బ్రూస్ లీ సొంత నగరంలో ఆర్జీవీ సినిమా ట్రైలర్ విడుదల

Published on Nov 25, 2019 8:00 PM IST

Drgaon

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతేడాది పలు కొత్త సినిమాల్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘ఎంటర్ థ గర్ల్ డ్రాగన్’ కూడా ఒకటి. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని అప్పుడే చెప్పిన వర్మ ప్రస్తుతం ఆ సినిమా పనుల్ని కూడా రీ స్టార్ట్ చేశారు. ఆప్పట్లోనే సినిమాను, అందులో కథానాయిక పాత్రను రివీల్ చేస్తూ ఒక వీడియో వదిలిన వర్మ ఇప్పుడు టీజర్ రెడీ చేశారు.

ఆ టీజర్ ను తనకెంతో ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, నటుడు అయిన బ్రూస్ లీ పుట్టినరోజైన నవంబర్ 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కేవలం తేదీనే కాదు బ్రూస్ లీ జన్మించిన సమయం సాయంత్రం 3:12 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు వర్మ. అంతేకాదు ట్రైలర్ ను డిసెంబర్ 13 వ తేదీన బ్రూస్ లీ సొంత నగరం చైనాలోని ఫోషన్ సిటిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ లో సినిమా నిర్మితమతోంది. ఇకపోతే వర్మ తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఈ నవంబర్ నెల 29న విడుడలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు