చూడబోతే వర్మ గట్టిగానే కొట్టేలా ఉన్నాడు

Published on Nov 11, 2019 6:39 pm IST

సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా టీజర్, ట్రైలర్, ప్రోమో సాంగ్స్ లాంటి వాటిలో మాత్రం స్ట్రైకింగ్ కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నారు వర్మ. అందుకు నిదర్శనమే ఆయన గత రెండు సినిమాలు ‘ఆఫీసర్, లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడినా ప్రమోషనల్ ఎలిమెంట్స్ పరంగా అలరించాయి. వీటి తరహాలోనే ప్రస్తుతం అయన చేస్తున్న కొత్త చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కూడా ఉంది.

రాజకీయ, సామాజిక వర్గాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే వివాదాస్పద రీతిలో ప్రచారం కల్పించడంలో సక్సెస్ అయ్యారు వర్మ. సినిమాకి సంబంధించి వర్మ విడుదలచేస్తున్న టీజర్, ప్రోమో సాంగ్స్ అన్నీ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఒక వర్గం వారిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ తంతు మొత్తాన్ని చూస్తుంటే ఈ నెల 29న విడుదలకానున్న ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించేలా కనబడుతోంది. పర్టిక్యులర్‌గా రాయలసీన రీజియన్లో మంచి స్టార్ట్ ఉండొచ్చు. టైగర్ కంపెనీ, అజయ్ మసూర్ ప్రొడక్షంన్స్ సంస్థలతో కలిసి వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More