రజినీకాంత్ పై వర్మ కామెంట్.!

రజినీకాంత్ పై వర్మ కామెంట్.!

Published on May 20, 2014 7:41 PM IST

rajini-kanth-rgv
ఎప్పటికప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సందర్బాలపై ఏదో ఒకరమైన సెటైర్స్ వేసి ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే డైరెక్టర్ ఎవరు అంటే వెంటనే చెప్పే పేరు రామ్ గోపాల్ వర్మ అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్, రాహుల్ గాంధీల పై సెటైర్స్ వేసిన వర్మ ఇప్పుడు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ పై సెటైర్ వేసాడు.

‘కొచ్చాడియాన్ విషయంలో నా సమస్య ఏమిటంటే.. నాకు రజినీకాంత్ బూబ్స్ అంటే ఇష్టం.. కానీ ఎందుకు వాటిని 3డిలో చూపించాలనుకున్నారు అనేది నాకు అర్థం కావటం లేదని’ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసాడు. ఈ కామెంట్ చాలా మంది రజినీ అభిమానులకు ఇబ్బంది కలిగించడంతో వారు ఎలాంటి రిప్లై ఇస్తారా అని అందరూ అనుకుంటున్నారు.

తాజా వార్తలు