ఆకట్టుకుంటున్నవిష్ణు ‘డైనమైట్’ మోషన్ పోస్టర్

ఆకట్టుకుంటున్నవిష్ణు ‘డైనమైట్’ మోషన్ పోస్టర్

Published on Mar 20, 2015 8:33 AM IST

Dynamite
వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా, ‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మరియు విమర్శకులను మెప్పించిన దేవకట్ట డైరెక్షన్ లో రానున్న సినిమా ‘డైనమైట్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాని సమ్మర్లో చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని నిన్న రాత్రి రిలీజ్ చేసారు. ఈ మోషన్ పోస్టర్స్ కి మంచు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ మోషన్ పోస్టర్స్ లో విష్ణు పవర్ఫుల్ లుక్స్ తో పాటు మంచు విష్ణు ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా సూపర్బ్ గా సెట్ అయ్యింది.అలాగే అచ్చు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంతో ఎంగేజింగ్ గా ఉంది. ఈ సినిమాలో మంచు విష్ణు టోటల్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్ గా ప్రణిత నటిస్తోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా విక్రమ్ ప్రభు హీరోగా, ప్రియ ఆనంద్ హీరోయిన్ గా తమిళంలో ఘన విజయం సాధించిన ‘అరిమ నంబి’కి రీమేక్. మంచు మోహన్‌బాబు సమర్పణలో ప్రతిష్టాత్మకమైన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

డైనమైట్ మోషన్ పోస్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు