శంకర్-రజనీల ‘రోబో 2’కు ముహూర్తం కుదిరింది..!

శంకర్-రజనీల ‘రోబో 2’కు ముహూర్తం కుదిరింది..!

Published on Sep 10, 2015 3:59 PM IST

shankar_rajinikanth

శంకర్, రజనీకాంత్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొంది సౌత్ ఇండియన్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘రోబో’. 2010లో విడుదలైన ఈ గ్రాఫికల్ వండర్‌కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందించే విషయమై దర్శకుడు శంకర్ కసరత్తులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాల్లో ఓ అద్భుతంగా ‘రోబో 2’ ఉండేలా శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా లాంచ్ అయ్యేది ఎప్పుడు అనే విషయమై ఇప్పటివరకూ ఓ సరైన క్లారిటీ రాకపోగా, ఈ ఉదయం డిసెంబర్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న లాంఛనంగా మొదలుకానున్నట్లు సినిమా నిర్మాణ సంస్థ సంకేతాలు పంపింది. భారీ బడ్జెట్‌తో, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫీల్ తెచ్చేందుకు దర్శకుడు శంకర్, ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు హాలీవుడ్ నటుడిని ఒప్పించనున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఇక ప్రస్తుతం రజనీకాంత్, దర్శకుడు రంజిత్‌తో కలిసి ‘కబాలి’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు