“లక్కీ స్టార్” గా తెలుగులోకి వస్తున్న కన్నడ రాక్ స్టార్ యశ్!

Published on Aug 3, 2021 5:02 pm IST

కేజీఎఫ్ చిత్రం తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న యశ్ హీరో గా కన్నడ లో ఘన విజయం సాధించిన లక్కీ అనే చిత్రాన్ని తెలుగు లోకి లక్కీ స్టార్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధికా కుమార్ స్వయంగా నిర్మించడం జరిగింది. అయితే రాధికా కుమార్ స్వామి సమర్పణ లో ఈ చిత్రాన్ని తెలుగు లోకి తీసుకు వస్తున్నారు. అయితే శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవి రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే డాక్టర్ సూరి దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం లో యశ్ సరసన హీరోయిన్ గా రమ్య నటించడం జరిగింది. అయితే లవ్ – కామెడీ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలను జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రం నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ, కన్నడలో యష్ కు స్టార్ డమ్ తెచ్చిన చిత్రాల్లో లక్కీ ఒకటి అని, యష్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, రాబర్ట్ ఫేమ్ అర్జున్ జన్య మ్యూజిక్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణలు అని అన్నారు. సీనియర్ రైటర్ గురుచరణ్ తెలుగులో మాటలతో పాటు పాటలు కూడా రాశారు అని అన్నారు. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని, అనువాద కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి అని, త్వరలో విడుదల తేది ప్రకటిస్తామని అన్నారు.

సంబంధిత సమాచారం :