
1990లలో బాగా ఫేమస్ అయిన హీరోయిన్, వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యురాలైన రోజా ఎట్టకేలకు ఈ సారీ పార్టీ టికెట్ సంపాదించుకుంది. రోజా ఈ సారి తన నియోజక వర్గమైన నరరి నుండి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది.
టిడిపిలో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన రోజా ఆ పార్టీలో పలు ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రోజా కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి జగన్ పెట్టిన వైఎస్ఆర్ సిపిలోకి అడుగు పెట్టింది.
ప్రస్తుతం వైసిపి పార్టీ తరపున జోరుగా ప్రచారం చేస్తున్న రోజా తన నియోజకవర్గంలో గెలుస్తుందో లేదో అనే దాని కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

