సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న ‘రోమాంచకం’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. ఇక తాజాగా ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ప్రారంభంలో ఒక క్యూట్ లవ్ స్టోరీలా అనిపించినప్పటికీ, ఆ తర్వాత లీడ్ పాత్రల మధ్య వచ్చే విభేదాలు, అనుకోని ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. నేటి తరం రిలేషన్‌షిప్‌లోని ప్రేమ, గొడవలు మరియు ఎమోషన్స్‌ను చాలా సహజంగా చూపించనున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, వాసుకి వైభవ్ అందించిన బీజీఎం మరియు ఆకట్టుకునే డైలాగ్స్ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి.
మొత్తానికి ‘రోమాంచకం’ చిత్రం ఒక పక్కా యూత్‌ఫుల్ రైడ్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


