యూత్ లో కొనసాగుతున్న రొమాంటిక్ క్రేజ్!

Published on Oct 30, 2021 1:12 am IST


ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్ గా అనిల్ పాడురీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం రొమాంటిక్. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడం విశేషం. మొదటి నుండి ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ విడుదల చేయడం తో సినిమా పై మొదటి నుండి ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం నేడు థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాక బుక్ మై షో, పే టి ఎమ్ మరియు గూగుల్ లో 90 శాతం కి పైగా రేటింగ్ నమోదు కావడం తో సినిమా చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. యూత్ లో ఈ తరహా ఇంట్రస్ట్ క్రియేట్ అవ్వడం తో సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు థియేటర్ల కి క్యూ కడుతున్నారు. అనీల్ పాడురీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. రమ్య కృష్ణ ఈ చిత్రం లో కీలక పాత్రలో నటించడం జరిగింది.

సంబంధిత సమాచారం :