దర్శకుడు పూరి కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా, కేతికా శర్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం `రొమాంటిక్`. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా షెడ్యూల్ కొరకు చిత్ర యూనిట్ గోవా వెళ్లారు. 30 రోజుల పాటు జరిగిన లాంగ్ షెడ్యూల్ అనంతంరం షూటింగ్ పూర్తయ్యింది. దీనితో చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కొరకు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. రొమాంటిక్ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా ఈ గోవా షెడ్యూల్ నందు పాల్గొన్నారు.
ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, సాంగ్స్‌ను చిత్రీకరించారు. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్రమిది.సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా నరేశ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


