కాజల్ టీనేజ్ గర్ల్ గా మారనుందా …?

Published on Aug 30, 2019 11:00 pm IST

చందమామ కాజల్ ఇటీవల తెలుగులో నటించిన సీత, రణరంగం రెండు చిత్రాలు కూడా ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ఐతే ఆమె తమిళంలో జయం రవికి జంటగా చేసిన కోమలి చిత్రం మాత్రం హిట్ టాక్ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె తమిళంలో నటించిన ప్యారిస్ ప్యారిస్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది హిందీ చిత్రం క్వీన్ కి తమిళ రీమేక్. ఐతే కాజల్ నటిచబోతున్న మరొక చిత్రం గురించి ఆసక్తికర వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

కాజల్ అగర్వాల్ హిందీలో ‘ముంబై సాగా’ అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకొందట. జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించే ఈ చిత్రంలో కాజల్ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తుందట. విశేషం ఏమిటంటే అందులో ఒక పాత్రలో ఆమె 17 ఏళ్ల అమ్మాయి గా కనిపిస్తుందట. మరి దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త.

సంబంధిత సమాచారం :