మరో సాలిడ్ రికార్డ్ ను సెట్ చేసిన ధనుష్, సాయి పల్లవి “రౌడీ బేబీ”

Published on Jul 9, 2021 2:39 pm IST

బాలాజీ మోహన్ దర్శకత్వం లో ధనుష్, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం మారి2. అయితే ఈ చిత్రం లోని ధనుష్ మరియు సాయి పల్లవి ల పాట అయిన రౌడీ బేబీ ప్రేక్షకులని, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పాట క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ పాట యూ ట్యూబ్ లో మరొక సాలిడ్ రికార్డ్ ను సెట్ చేసింది. ఇప్పటి వరకు కూడా ఈ పాట 5 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 1.1 బిలియన్ వ్యూస్ ను సాధించడం జరిగింది.

అయితే రౌడీ బేబీ పాటను జనవరి 2, 2019 లో యూ ట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ పాటకు సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు. అయితే ఈ పాటకు కొరియోగ్రఫీ ప్రభుదేవా అందించారు. అయితే ఈ చిత్రం కి ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, తోవినో థామస్, కృష్ణ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :