యంగ్ హీరో నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా ‘రౌడీ ఫెలో’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్ర టీం ఈ సినిమాని నవంబర్ 21న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్ర నిర్మాత ప్రకాష్ రెడ్డి రౌడీ ఫెలో నారా రోహిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుందని అంటున్నాడు. ‘రౌడీ ఫెలో సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నారా రోహిత్ నటన సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. నారా రోహిత్ కెరీర్లో రౌడీ ఫెలో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని’ ప్రకాష్ రెడ్డి తెలిపాడు. ఫేమస్ లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను రీమిక్స్ చేసారు. సన్నీ సంగీతం అందించారు.


